Webdunia - Bharat's app for daily news and videos

Install App

30న పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం : సిద్ధమైన ఇస్రో

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (08:19 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఈ నెల 30వ తేదీన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఇది ఒక వాణిజ్యపరమైన ప్రయోగం. సింగపూర్‌కు చెందిన పలు ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఇందుకోసం పీఎస్ఎల్వీ సీ56 రాకెట్‌ను సర్వసన్నద్ధం చేశారు. ఈ ప్రయోగాన్ని ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటరులో సన్నాహాలు జరుగుతున్నాయి. జులై 30న ఉదయం 6.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు.
 
శ్రీహరికోటలోని మొదటి లాంచ్ పాడ్ ఈ రాకెట్ ప్రయోగానికి వేదికగా నిలవనుంది. పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ద్వారా ప్రధానంగా సింగపూర్ డీఎస్ టీఏ-ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లనుంది. దాంతోపాటే సింగపూర్ నాన్యాంగ్ టెక్నాలాజికల్ యూనివర్సిటీకి చెందిన వెలాక్స్-ఏఎం, ఆర్కేడ్, స్కూబ్-2 ఉపగ్రహాలను... సింగపూర్ న్యూస్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన న్యూలియాన్, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన గెలాసియా-2, ఏలియనా ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ కు చెందిన ఓఆర్ బి-12 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది.
 
కాగా, ఈ రాకెట్ ప్రయోగాన్ని ప్రజలు వీక్షించవచ్చని, ఆసక్తి గలవారు తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఇస్రో సూచించింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని షార్ సెంటర్ అధికారులు తెలిపారు. కాగా, ఇటీవలే ఈ కేంద్రం నుంచి చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments