Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీలోకి రీమేక్ కానున్న తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (13:34 IST)
తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ "గీత గోవిందం". గత యేడాది ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించింది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్-2 నిర్మాణ సంస్థపై బన్నీ వాసు నిర్మించారు. కేవలం ఒక్క తెలుగులోనేకాకుండా ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. 
 
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ, కన్నడ భామ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని చూసిన చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, స‌మంత‌, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్ తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. 
 
గోపీ సుంద‌ర్ అందించిన సంగీతం కూడా చిత్ర విజ‌యంలో స‌గభాగం అయింది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై రీమేక్ చిత్రం రూపొంద‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో విజ‌య్ పాత్ర‌ని 'ద‌ఢ‌క్' ఫేం ఇషాన్ క‌ట్ట‌ర్ చేయ‌నున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే, హీరోయిన్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకుడు ఎవరన్నది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments