Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డికి మంత్రి అఖిల ప్రియ ఫోన్...?! అందుకే చేశారా?

వచ్చే 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే అవకాశం మంత్రి అఖిలప్రియకు దక్కదా? ఏవీ హెల్ప్ లైనుకు ఆళ్లగడ్డలో సీటుకు లింకేంటి? ఆళ్లగడ్డలో అసలేం జరుగుతోంది. ఇప్పుడిదే చర్చ. ఎందుకంటే ఇటీవలే ఏవీ సుబ్బారెడ్డి మంత్రి అఖిల ప్రియపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమ

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (18:07 IST)
వచ్చే 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే అవకాశం మంత్రి అఖిలప్రియకు దక్కదా? ఏవీ హెల్ప్ లైనుకు ఆళ్లగడ్డలో సీటుకు లింకేంటి? ఆళ్లగడ్డలో అసలేం జరుగుతోంది. ఇప్పుడిదే చర్చ. ఎందుకంటే ఇటీవలే ఏవీ సుబ్బారెడ్డి మంత్రి అఖిల ప్రియపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అసలే ప్రత్యేక హోదా విషయంపై అటు పవన్ కళ్యాణ్ ఇటు జగన్ మోహన్ రెడ్డిల మధ్య నలిగిపోతున్న తెదేపా బాస్‌కు ఇదో కొత్త తలనొప్పిలా మారిందని అంటున్నారు.
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే... తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీకి సై అని ఏవీ సుబ్బారెడ్డి అనడమే కాదు మంత్రి అఖిలప్రియపై మండిపడ్డారు. అఖిలప్రియ తనను పరోక్షంగా ‘గుంటనక్క’ అని సంబోధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భూమా నాగిరెడ్డే బతికి ఉంటే ఈ మాట నన్నందుకు ఆయన అఖిల చెంపలు పగులగొట్టేవారనీ అన్నారు. ఏవీ హెల్ప్ లైన్ ప్రకటిస్తూ ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్కయ్యింది.
 
చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని చెప్పడం ఇప్పుడు దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఇదిలావుండగానే మంత్రి అఖిలప్రియ పాదయాత్రలో వున్న జగన్ మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు మరో ప్రచారం జరుగుతోంది. దాని సారాంశం ఏమిటంటే... వచ్చే ఎన్నికల్లో తనకు ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని అఖిలప్రియ కోరారన్నది. మరి ఇందులో నిజం ఎంత వున్నదో తెలియదు కానీ ప్రచారం మాత్రం జరిగిపోతోంది. దీనిపై అఖిలప్రియ క్లారిటీ ఇస్తేగానీ తెలియదు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments