Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో యువతికి పరిచయం.. 192గ్రాముల నగలు, రూ.9.33 లక్షలు కాజేశాడు

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (14:45 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫ్రెండ్‌ చేతిలో తిరుపతికి చెందిన ఓ యువతి మోసపోయారు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. టీటీడీకి చెందిన ఓ ఇంజనీర్‌ కుమార్తెకు అనంతపురానికి చెందిన దీపాబాబు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

నిత్యం ఆమెతో చాట్‌చేస్తూ వచ్చిన అతను అనంతపురం కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకోసం కొంత ఖర్చు పెట్టాలంటూ.. విడతలవారీగా రూ.9.33 లక్షలతోపాటు 192 గ్రాముల బంగారు నగలు తీసుకున్నాడు.

ఆ తర్వాత అతడి నుంచి ఎటువంటి స్పందన లేదు. పైగా ఫేస్‌బుక్‌లోనూ కనిపించకుండా పోయాడు. మోసం చేశాడని ఆలస్యంగా గుర్తించిన ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. యువతి తండ్రి శనివారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments