Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్‌కు సంబంధించిన వెబ్‌సైట్లు, యాప్‌లతో పిల్లలకు హాని.. ఎవరు?

Advertiesment
ఫేస్‌బుక్‌కు సంబంధించిన వెబ్‌సైట్లు, యాప్‌లతో పిల్లలకు హాని.. ఎవరు?
, బుధవారం, 6 అక్టోబరు 2021 (14:37 IST)
సోషల్ మీడియాతో కొంత మేలు జరిగినా చాలా మటుకు డేంజర్ అనే చెప్పాలి. తాజాగా ఎఫ్ బీతో పాటు మరికొన్ని సామాజిక మాధ్యమాలు.. కొన్ని గంటలు స్తంభించిన సంగతి తెలిసిందే. తాజాగా వినియోగదారుల భద్రత కన్నా ఆర్థిక ప్రయోజనాలకే కంపెనీ అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్ చెప్పారు.
 
ఫేస్‌బుక్‌కు సంబంధించిన వెబ్‌సైట్లు, యాప్‌లు పిల్లలకు హాని కలిగించడంతో పాటు విభేదాలకు కారణమవుతాయని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని అమెరికా చట్టసభ సభ్యులతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పారు. మాజీ ప్రాడక్టు మేనేజర్ అయిన 37 ఏళ్ల ఫ్రాన్సెస్ హౌజెన్, క్యాపిటల్ హిల్‌లో జరిగిన విచారణలో ఫేస్‌బుక్ కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కంపెనీ నియమనిబంధనలపై లోతైన పరిశీలన జరపాలనే డిమాండ్లు ఫేస్‌బుక్ యాజమాన్యానికి ఎదురయ్యాయి. ఈ విమర్శలను ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఖండించారు. కంపెనీ గురించి అసత్య ప్రచారాలు జరిగాయని అన్నారు.
 
''కంపెనీపై వచ్చిన చాలా ఆరోపణలు, అర్థం లేనివని'' తన ఉద్యోగులకు రాసిన లేఖలో జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. హానికరమైన కంటెంట్‌పై పోరాటం, పారదర్శకంగా పనిచేయడం ఇలాంటి ముఖ్యమైన అంశాల్లో మనం చేస్తోన్న ప్రయత్నాల పరంగా చూసుకుంటే ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు అని ఆయన అన్నారు. ''భద్రత, మానసిక ఆరోగ్యం, ప్రజాశ్రేయస్సుపై ఫేస్‌బుక్ చాలా శ్రద్ధ తీసుకుంటుంది. మన పనిని, మన ఉద్దేశాలను తప్పుగా చూపించే ప్రచారం జరగడాన్ని చూడటం కష్టంగా ఉంది'' అని ఫేస్‌బుక్ పేజీలో బహిరంగ లేఖ రాశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెట్టుదిగిన యూపీ సర్కారు - లఖీంపూర్ ఖైరీకు రాహుల్