కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించింది.
మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ పేరును అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఎఐసిసి) ప్రకటించింది. ఈ మేరకు పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈమె 2009-14లో బద్వేల్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
2014-17 మధ్య కాలంలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మెంబరుగా ఉన్నారు. ఎఐసిసి మెంబరుగా, ఎపిసిసి కో-ఆర్డినేషన్ కమిటీ మెంబరుగా, 2019 రాష్ట్ర ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మెంబరుగా పనిచేశారు. బీజేపీని ప్రశ్నించలేని స్థితిలో వైసిపి ఉందని, అన్యాయాన్ని ప్రశ్నించడానికే బద్వేల్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని శైలజానాథ్ ప్రకటించారు.