Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యోగా' అంటే ఏంటి? ఆర్కే బీచ్‌లో ప్రధాని మోడీ చెప్పిన అర్థమిదే.. (Video)

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (10:31 IST)
ప్రతి యేటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఏపీలోని సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్‌లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ యోగా దినోత్సవం "మానవాళి కోసం యోగా 2.0"కు నాంది పలకాలని, దీనిద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు. 
 
యోగా కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా, ప్రపంచ భాగస్వామ్యానికి మాధ్యమంగా మారాలని, ప్రతి దేశం, సమాజం యోగాను తమ జీవన విధానంలో, ప్రభుత్వ విధానంలో భాగంగా చేసుకోవాలని ఆయన ఆకాక్షించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యోగా కేవలం వ్యాయామం కాదని అదొక జీవన విధానమన్నారు. యోగా అంటే సరళంగా చెప్పాలంటే కలపడం ఇది ప్రపంచాన్ని కలిపింది అని ఆయన తెలిపారు.
 
విశాఖలోని ఆర్కే బీచ్‌లో మూడు లక్షల మందికిపై ప్రజలతో కలిసి ప్రధాని మోడీ కామన్ యోగా ప్రోటోకాల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందం, శాంతిని పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి ప్రపంచాన్ని నడిపించడం ద్వారా యోగా శాంతిని చేకూర్చగలదని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. 
 
"దురదృష్టవశాత్తు, నేడు ప్రపంచం మొత్తం ఉద్రిక్తత, అశాంతితో సతమతమవుతోంది. అనేక ప్రాంతాల్లో అస్థిరత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో యోగా మనకు శాంతి మార్గాన్ని చూపుతుంది. మానవాళి శ్వాస తీసుకోవడానికి సమతుల్యం చేసుకోవాడానికి తిరిగి సంపూర్ణంగా మారడానికి అవసరైన విరామ బటన్‌ యోగా" అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments