Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి విశాఖలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (07:04 IST)
విశాఖ సాగర తీరం అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలకు మరోసారి వేదిక కాబోతోంది. ఈనెల 16 నుంచి ఆర్కే బీచ్​లో పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు తెలిపారు.

విశాఖలో ఈనెల 16 నుంచి ఆర్కే బీచ్​లో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఏవీసీ బీచ్ వాలీ బాల్ కాంటినెంటల్ కప్ పేరిట ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పోటీల్లో ఆసియా దేశాలైన ఇరాన్, కజికిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, భారత్ నుంచి క్రీడా జట్లు పాల్గొంటాయని తెలిపారు. గతంలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు విశాఖలో జరిగినా.. ఈసారి జరగనున్న పోటీలకు ప్రత్యేకత ఉందన్నారు.

ఇక్కడ విజేత జట్లు ఆసియా స్థాయిలో మరో మెగా టోర్నీలో పాల్గొంటాయని అక్కడ ప్రతిభ కనబరిస్తే రాబోయే ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు నగరవాసులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments