Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ, కాకినాడ తీరంలో భారత్-అమెరికా సైనిక విన్యాసాలు

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (18:36 IST)
అరుదైన సైనిక విన్యాసాలకు విశాఖ, కాకినాడ సాగర తీరం వేదిక కాబోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలోని సాగర జలాల్లో.. అమెరికా, భారత్‌‌లు సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.

ఈ నెల 13 నుంచి మొదలయ్యే ఈ విన్యాసాలు 8 రోజుల పాటు కొనసాగనున్నాయి. విశాఖలోని తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ, కాకినాడ తీరాల్లో విన్యాసాలు నిర్వహించనున్నారు.

500 మంది అమెరికన్‌ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది ఈ విన్యాసాల్లో భాగస్వాములుకానున్నారు. అలాగే భారత్‌, యూఎస్‌ఎస్‌ జర్మన్‌ టౌన్‌ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకోనున్నాయి.
 
‘టైగర్‌ ట్రయాంఫ్‌’పేరుతో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక విన్యాసాలను ఇండో, పసిఫిక్‌ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఉపయోగపడతాయని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచ దేశాలకు సవాల్ విసరుతున్న ఉగ్రవాదాన్ని అణిచివసేందుకు, టెర్రరిస్టులను హెచ్చరిస్తూ.. ఇండో, అమెరికా ఆయుధ సంపత్తి ద్వారా సత్తా చాటేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇంతకు ముందే భారత్, అమెరికాలు సంయుక్తంగా వివిధ దేశాలతో కలిసి యూఎస్‌–ఏషియన్ ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments