ఏపీలో వైకాపాదే గెలుపు.. ఇండియా టీవీ పోల్

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (05:19 IST)
ఏపీలో వైకాపాదే గెలుపు అని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ఒపీనియల్ పోల్ అంచనా వేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో మొత్తం వైకాపా, టీడీపీ మధ్యనే పోటీ వుండవచ్చునని పోల్ అంచనా వేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచాయి. 
 
కానీ ఈసారి వైసీపీ 7 సీట్లు కోల్పోవచ్చునని... అవి టీడీపీ ఖాతాలో పడే అవకాశముందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. అలాగే తెలంగాణ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చునని సర్వేలో తేలింది. 
 
కానీ ఏపీలో మాత్రం ఈ జాతీయ పార్టీలు... రెండూ ఒక్క సీటూ గెలుచుకునే అవకాశాలు లేవని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఇంకా జాతీయంగా దక్షిణ భారతదేశంలో 132 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 38, ఇండియా కూటమి 60, ఇతరులు 32 గెలుచుకోవచ్చునని ఈ సర్వే అంచనా వేసింది. అలాగే కర్ణాటక లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను బీజేపీ దక్కించుకోగలుగుతుంది. 
 
కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్- 11, వామపక్షాలకు చెందిన ఎల్డీఎఫ్- 6, బీజేపీ- 3 చోట్ల గెలుస్తాయి. తమిళనాడులో డీఎంకే-20, కాంగ్రెస్-6, బీజేపీ-5, ఏఐఏడీఎంకే-5 స్థానాల్లో విజయం సాధిస్తారని తాజా పోల్‌ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments