Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఐ.టి. కలకలం... సక్కు గ్రూపు సంస్థలపై దాడులు..

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (10:30 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రో మాటు ఐ.టి. దాడులు క‌ల‌క‌లం రేపాయి. గుంటూరుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సక్కు గ్రూపు సంస్థలపై ఐటీ దాడులు ఉదయం నుండి కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 23 ఆ సంస్థకు చెందిన కార్యాలయాలు, కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.
 
 
తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాలలో కోడి గుడ్ల వ్యాపారంలో సక్కు గ్రూప్స్ ఇటీవల కాలంలో మంచి పేరొందింది. దీనితోపాటు మిర్చి ఎగుమ‌తులు, స్పిన్నింగ్ వ్యాపారాల‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ వ్యాపార లావాదేవీల‌పై ఐ.టి. అధికారులు చెక్ పెట్టారు. ముఖ్యంగా గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ బ్రాంచ్ లో ఉదయం నుండి దాదాపు 50 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. ఆఫీసు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. లోపల ఉన్న వారిని కూడా బయటకి రానివ్వడం లేదు. వారి మొబైల్స్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 
వందల కోట్ల కు సంబంధించిన లావాదేవీలకు సరైన టాక్స్ చెల్లించడం లేదని వచ్చిన సమాచారం మేరకు ఏకకాలంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. అయితే, అక్ర‌మ వ్యాపారాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments