Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్లలో అన్నదాతలకు మొత్తం దాదాపు రూ. 85,000 కోట్లు లబ్ది!

Webdunia
సోమవారం, 24 మే 2021 (13:22 IST)
రైతు సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దాని కన్నా ముందుగా.. మాట ఇచ్చిన దాని కన్నా మిన్నగా రైతన్నలకు సాయం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైతు కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని విశ్వసించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రైతన్నకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తున్నారు. 
 
వైఎస్సార్ రైతు భరోసా : వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో ప్రతి రైతుకు రూ.67,500 సాయం అందిస్తోంది ప్రభుత్వం.. వైఎస్సార్ రైతు భరోసా - పి.యం. కిసాన్ క్రింద ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు దాదాపు రూ.17,030 కోట్లు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, దేవాదాయ, అటవీ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా "వైఎస్సార్ రైతు భరోసా" క్రింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. మొదటి విడతగా ఖరీఫ్ పంట వేసే మే నెలలోపే రూ.7,500 రైతుభరోసా పెట్టుబడిసాయం, రెండవ విడతగా ఖరీఫ్ పంట కోత సమయం అక్టోబర్ నెలలోపే, రబీ అవసరాల కోసం మరో రూ.4,000, మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో మరో రూ.2,000 రైతుల ఖాతాలో రైతు భరోసా సాయం జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
 
రైతు భరోసా కేంద్రాలు: రైతన్నకు అండగా రైతు గడప వద్దనే సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778  వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా గ్రామాలలోనే విత్తనం నుండి పంట అమ్మకం వరకు అన్నివేళలా సహాయంగా ఉండే విధంగా ప్రభుత్వం సేవలు అందిస్తోంది.

ఆర్బీకేల ద్వారా నకిలీలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వంచే ధృవీకరించబడిన కల్తీలేని నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు, ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్, పంటల బీమా, వడ్డీలేని రుణాలు, పంట కొనుగోలు కేంద్రాల సేవలు, భూసార పరీక్షలు, వ్యవసాయ నిపుణుల సూచనలు, సలహాలు, గ్రామస్థాయిలోనే వ్యవసాయ ధరలు, మార్కెట్ల వివరాలు, వాతావరణ సూచనలు ఇలా అన్ని రకాల సదుపాయాలు అందించబడుతున్నాయి.

రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో, ఈ కేంద్రాల ద్వారా కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే సదుపాయం కల్పించాం. రైతులకు ఏ ఇబ్బందులు, నష్టాలు లేకుండా తమ పంటలను అమ్ముకోవడానికి ఈ ఆర్బీకేల ప్రక్కనే జనతా బజార్లు ఏర్పాటు. ఆర్బీకేలలో సేవలందించడానికి 744 ఫిషరీస్ అసిస్టెంట్స్ ను నియమించింది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా చెల్లించింది.

ఆర్బీకేల ద్వారా మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ అందిస్తోంది. పశువులు, కోళ్లు, మత్స్యరంగానికి అవసరమైన నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్ ఫుట్స్ కూడా సరఫరా చేసింది.

రూ.14,000 కోట్ల ఖర్చుతో మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, గ్రేడింగ్ సౌకర్యాలు, డ్రైయింగ్ ఫ్లోర్లు, ప్యాకింగ్ వ్యవస్థ, ప్రైమరీ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరీక్షల కోసం ఎస్పేయింగ్ ఎక్విప్ మెంట్, కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి ఆర్బీకేలతో అనుసంధానం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్బీకేలకు అనుసంధానంగా అమూల్ భాగస్వామ్యంతో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు.

అమూల్ ద్వారా పాడి రైతులు లీటర్ పాలకు గతంలో కంటే రూ.5 నుండి రూ.15 వరకు అదనంగా అందుకుంటున్నారు. గొర్రెలు, మేకలు పెంపకందార్లకు ఆధునిక పోషణ, యాజమాన్య పద్ధతులపై పశు విజ్ఞానబడి ద్వారా శిక్షణ అందిస్తోంది. 
 
రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా 2019-20 మరియు 2020-21 సంవత్సరాలకు గాను  రూ. 27,028 కోట్లతో 1,46,58,882 మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి, రూ. 5,964 కోట్లతో 16,46,303 మెట్రిక్ టన్నుల ఇతర పంటల ఉత్పత్తులకు మొత్తంగా 1,63,05,185 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులకు రూ. 32,992 కోట్లతో గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది.
 
వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం: రైతులకు వడ్డీ భారం తప్పించాలనే ఉదాత్త లక్ష్యంతో పంటల సాగు కోసం లక్ష రూపాయలలోపు తీసుకున్న పంట రుణాలపై రైతులకు పూర్తిగా వడ్డీ రాయితీ కల్పిస్తూ  ఈ - క్రాప్ డేటా ఆధారంగా రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడం, నిర్ణీత వ్యవధిలో ఆ రుణాలు చెల్లించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా, ఇప్పటివరకు గత ప్రభుత్వ బకాయిలతో సహా 67.50 లక్షల మంది రైతులకు 1,261కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.
 
వైఎస్సార్ ఉచిత పంటల బీమా: రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతులు 1 రూపాయి కూడా భారం పడకుండా రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. ఇప్పటివరకు 15,67,000 మందికి రూ.4,113.70 కోట్ల మేర లబ్ది చేకూర్చింది ప్రభుత్వం.

2020 ఖరీఫ్ కు సంబంధించిన పంటకోత ప్రయోగాలు మార్చిలో అయిపోయిన వెంటనే ఏప్రిల్ నెలలో ప్రణాళిక శాఖ నుండి నివేదికలు తీసుకొని బీమా పరిహారం చెల్లించడం చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. 25 మే, 2021 నాడు 2020 ఖరీఫ్ లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతులకు బీమా పరిహారంగా రూ.1,820.23 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం. 
 
వైఎస్సార్ జలకళ: వైయ‌స్సార్‌ జలకళ పథకం అమల్లోకి వచ్చాక బోరు తవ్వకంతో పాటు పంపుసెట్‌ ఏర్పాటు వంటివి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో "వైఎస్సార్ జలకళ పథకం " క్రింద ఒక రిగ్ ఏర్పాటు చేసి 4 ఏళ్లలో సుమారుగా రూ.4,932 కోట్ల వ్యయంతో దాదాపు 2 లక్షల బోర్లు వేయిస్తూ సన్న, చిన్నకారు రైతులకు మోటార్లు కూడా ఉచితంగా ఇస్తోంది ప్రభుత్వం. 
 
వైఎస్సార్ మత్స్యకార భరోసా క్రింద ఇప్పటివరకు 1,19,875 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.332 లబ్ది. ఏడాదికి రూ.780 కోట్ల వ్యయంతో 53,550 మంది ఆక్వా రైతులకు ఇప్పటివరకు రూ.1,560 కోట్ల లబ్ది కలిగేలా యూనిట్ కరెంట్ కేవలం రూ.1.50లకే సరఫరా చేయడం జరిగింది.
 
రైతన్నల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలు
 
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడానికి మద్దతు ధరల ప్రకటనలో భాగంగా  
రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. 
 
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పంట నష్టపరిహారాన్ని అందిస్తోంది ప్రభుత్వం.. డిసెంబర్, 2020 వరకు పంటలు నష్టపోయిన 13.56 లక్షల మంది రైతులకు రూ.1,038 కోట్లు చెల్లించాం. రూ.2,000 కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేశాం.
 
వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా..రూ.17,430 కోట్లతో ఉచిత విద్యుత్ సబ్సిడీ..నాణ్యత పెంచేందుకు విద్యుత్ ఫీడర్లకు మరో రూ.1,700 కోట్లు ఖర్చు..
 
నైరాశ్యంలో ఉన్న రైతాంగంలో జవజీవాలు నింపేందుకు, వివిధ వ్యవసాయ అనుబంధ రంగాల మధ్య సమన్వయం కోసం, రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు విధివిధానాల ఖరారుకు రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఏర్పాటు. పంటల సాగుపై సమగ్ర ప్రణాళిక నిమిత్తం రైతు భరోసా కేంద్రాలు, మండల, జిల్లా స్థాయి రైతుల సలహా మండళ్ల ఏర్పాటు.. 
 
శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలుకు రూ. 1500 చొప్పున రూ. 300 కోట్లు బోనస్ గా విడుదల
 
గతంలో కనీస గిట్టుబాటు ధరలు లేని మిరప, పసుపు, ఉల్లి, చిరుదాన్యాలకు పంట వేసే సమయంలోనే కనీస గిట్టుబాటు ధరల ప్రకటన... ప్రతి గ్రామ సచివాలయంలో ఆయా గ్రామాల్లో పండే పంటల కనీస గిట్టుబాటు ధర, వాటి శాశ్వత కొనుగోలు కేంద్రాల వివరాల ప్రదర్శన.. కొనుగోలు ప్రక్రియలో మధ్య దళారీల నిర్మూలన
 
ప్రమాదవశాత్తు మరణించిన/ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 7 లక్షలు పరిహారంగా చెల్లిస్తున్నాం...అర్హులై ఉండి కూడా గత ప్రభుత్వం పరిహారం ఇవ్వని వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది...
 
పశు నష్టపరిహారం పథకం ద్వారా మరణించిన ఆవులు, గేదెలకు రూ. 15,000 నుంచి రూ.30,000 వరకు గొర్రెలు, మేకలకు రూ. 6,000 నష్ట పరిహారం చెల్లింపు
 
వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్ రద్దు
 
2020 నవంబర్ నెలలో నివర్ తుఫాన్ కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని  నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ వారి బ్యాంకు ఖాతాలకు జమచేశాం
 
ఖరీఫ్ 2020 సీజన్ లో 13.96 లక్షల మంది రైతులకు 6.99 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను అలాగే రబీ 2020-21లో 2.29 లక్షల క్వింటాళ్లు 3.04 లక్షల మందికి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా దిగ్విజయంగా పంపిణీ చేశాం. 
 
నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతన్నలకు ఊరట కల్పిస్తూ తడిసిన, రంగు మారిన,మొలకలు వచ్చిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి మరీ కొనుగోలు..
 
రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు మొత్తం రూ.84,468.83 కోట్లు లబ్ది చేకూర్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

లక్ష రూపాయలు గెలుచుకోండంటూ డియర్ కృష్ణ వినూత్న కాంటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments