బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఏపీకి పొంచివున్న భారీ వర్షాలు

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (09:41 IST)
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం నెలకొంది. ప్రస్తుతానికి తీరానికి సమీపంలోని కదులుతుండడంతో చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని, చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
 
ఇక మంగళవారం విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
 
అలాగే బుధవారం నాడు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సముద్రంలో గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
 
రాష్ట్రంలోని గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, కళింగపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments