Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో మద్యం కొనాలంటే అది తప్పనిసరి..?

Webdunia
శనివారం, 25 జులై 2020 (21:20 IST)
తిరుపతిలో మద్యం కొనేందుకు వెళుతున్నారా..? అయితే గొడుగు తప్పనిసరి. మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఉంటే సరిపోతుంది. గొడుగు ఎందుకు అనుకుంటున్నారా..? మద్యం కొనేందుకు మందుబాబులు వైన్ షాప్‌లకు చేరుకుని గుంపులు గుంపులుగా తోసుకుంటూ ఉండడంతో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి
 
దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు గొడుగుతో పాటు మాస్కు ధరించి వస్తేనే మద్యం బాటిళ్ళను అందిస్తున్నారు. లేకుంటే నిర్థాక్షిణ్యంగా పక్కకు పంపించేస్తున్నారు. సాధారణంగా వర్షం పడితేనో లేకుంటే ఎండ ఎక్కువగా ఉంటే గొడుగు వాడుతుంటాం.. అలాంటిది గొడుగు తప్పనసరి చేయడంతో మందుబాబులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
 
దీన్నే ఆసరాగా చేసుకున్న కొంతమంది గొడుగుల బిజినెస్‌కు తెరతీశారు. వైన్ షాపుల పక్కనే గొడుగులను అద్దెకు ఇస్తున్నారు. 20 నుంచి 30 రూపాయలను ఒక గొడుగుకు వసూలు చేస్తున్నారు. చేసేదేమీ లేక మందుబాబులు గొడుగులను అద్దెకు తీసుకుని క్యూలైన్లలో నిలబడి మద్యం కొంటున్నారు.
 
తిరుపతిలో నగరంలో విపరీతంగా కేసులు పెరిగిపోతుండడం.. అది కూడా సామాజిక దూరాన్ని జనం గాలికొదిలేశారని.. వైన్ షాపుల కారణంగా కూడా కేసులు పెరిగేందుకు ఆస్కారం ఉందని ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గొడుగు వేసుకుని నిలబడితే సామాజిక దూరం ఖచ్చితంగా ఉంటుందన్నది అధికారుల ఆలోచన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments