Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు తీసుకురాకపోతే మన బెడ్రూం వీడియోలు పెడతా: భార్యకు భర్త బెదిరింపు

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (18:56 IST)
అన్యోన్య దాంపత్యం. ఇద్దరు పిల్లలు. రెండు చేతులా సంపాదిస్తున్న భర్త. అయితే కరోనా పుణ్యమా అని ఉన్న ఉద్యోగం పోయింది. అప్పుల పాలయ్యారు. భర్త మద్యానికి బానిసయ్యాడు. భార్యను అదనపు కట్నం తీసుకురమ్మని చిత్రహింసలకు గురిచేశాడు. అంతటితో ఆగలేదు. భార్యాభర్తలిద్దరూ కలిసి వున్న ఏకాంత వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు.
 
గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువతితో 2016 సంవత్సరంలో వివాహం చేశారు. కట్నం కింద 5 లక్షల రూపాయల నగదు, 5 సవర్ల బంగారం, సామాన్లు, 10 లక్షల రూపాయల విలువచేసే ఇంటిస్థలాన్ని ఇచ్చారు. 2018 సంవత్సరంలో ఒక కూతురు, 2019 సంవత్సరంలో కొడుకు పుట్టారు. 
 
గుంటూరు జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు ప్రసాద్. కరోనా కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది. తిరిగి ఫ్యాక్టరీని తెరవలేదు. దీంతో ప్రసాద్ తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేశాడు. ఆ అప్పులు తడిసిమోపడయ్యాయి. అప్పులు కట్టలేక మద్యానికి బానిసై ఉన్న డబ్బును తాగుడుకు తగలేశాడు ప్రసాద్.
 
మద్యం మత్తులో భార్యతో గొడవపడి పుట్టింటికి వెళ్ళి అదనపు కట్నం తీసుకురమ్మని వేధించేవాడు. దీంతో భార్య, భర్త హింసను తట్టుకుంటూ వచ్చింది. కానీ గత వారంరోజుల నుంచి ప్రసాద్ తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను తనకే చూపించాడని.. ఆ వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.
 
అదనపు కట్నం తీసుకురాకుంటే మొత్తం వీడియోలను ఇంటర్నెట్లో పెడతాడని చెప్పడంతో చివరకు బాధితురాలు మహిళా పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడు పరారయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments