Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రాజెక్టులు ఆపకపోతే బీడుగా ఏపీ జిల్లాలు: కేంద్రానికి ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:02 IST)
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల అంశం వివాదాస్పదమవుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండడంతో సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడంలేదు.

తాజాగా ఈ అంశంలో ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య కేంద్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, అవి పూర్తయితే ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు నీరందక బీడుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలవనరుల శాఖ అత్యున్నత మండలి, సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోకుండానే కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి, దిండి, మిషన్ భగీరథ, భక్త రామదాసు, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య తన లేఖలో ఆరోపించింది.

శ్రీశైలం, సాగర్ లకు ఎగువన నిర్మితమవుతున్న ఈ డ్యామ్ లను ఆపి, దిగువ రాష్ట్రమైన ఏపీ రైతుల హక్కులను సంరక్షించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments