Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం.. హీరో నాని ఇంట్లో కూడా సోదాలు

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (14:09 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటితో పాటు.. ఆయన కుటుంబానికి చెందిన రామానాయుడు స్టూడియోలో బుధవారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 
 
రామానాయుడు స్టూడియోతోపాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
 
ఇటీవలకాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కంగారుపడుతున్నారు.
 
కాగా, గత నెలలో ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నైజాంలో‌ భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్‌ను కూడా ఈ సంస్థ నిర్మించింది. 
 
మరోవైపు, టాలీవుడ్ హీరో నానికి చెందిన గృహాల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఉంది. ఇక్కడ ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments