Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకాను హత్య చేసి ఆస్పత్రిలో చేరిన పరమేశ్వర్ రెడ్డి?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (15:07 IST)
మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో మరోపేరు తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి పేరును అనుమానితుల పేర్ల జాబితాలో పోలీసులు చేర్చారు. ఓ భూవివాదం కేసులో వివేకాను పరమేశ్వర్ రెడ్డి బెదిరించినట్టు వార్తలు వస్తున్నాయి. అందువల్ల పరమేశ్వర్ రెడ్డే హత్య చేసి తిరుపతికి వెళ్లి ఆస్పత్రిలో చేరివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
వివేకానద రెడ్డి హత్య కేసు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. వచ్చే నెలలో ఎన్నికల పోలింగ్ జరుగనున్న సమయంలో జరిగిన ఈ హత్య కేసులోని మిస్టరీని చేధించడం ఇపుడు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వివేకాకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న పరమేశ్వర్ రెడ్డిని పేరు తెరపైకి వచ్చింది. 
 
ఈయన వివేకా హత్య జరిగిన రోజు నుంచి కనిపించకుండాపోయారు. ఇపుడు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించారు. వివేకా హత్య గురించి అతడిని మీడియా ప్రశ్నించగా... తనకు అనారోగ్యంగా ఉండడంతో మొదట కడప సన్‌షైన్ ఆసుపత్రిలో చేరానని వెల్లడించాడు. అయితే తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ మూడు రోజులు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం తాను తిరుపతికి వచ్చి చేరినట్టు చెప్పారు. 
 
వివేకానందరెడ్డి హత్య కేసులో తన పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆయన హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడు. వివేకా హత్య ఇంటి దొంగల పనే అని చెప్పిన పరమేశ్వర్ రెడ్డి.... పోలీసులు అనవసరంగా తనపై నిందలు మోపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, పరమేశ్వర్ రెడ్డి గతచరిత్ర చూస్తే ఆయనపై పలు హత్యకేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments