ఇంట్లోకి వెళ్లి యువతిని వాటేసుకున్న పోకిరి... స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన మహిళలు

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (13:37 IST)
ఓ పోకిరీకి పలువురు మహిళలు దేహశుద్ధి చేశారు. ఓ యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన పోకిరీ.. నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆమెను హగ్ చేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి బిగ్గరగా అరవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఆ పోకిరిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. 
 
ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మూసాపేట పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జింకలవాడకు చెందిన అంజి (19) అనే యువకుడు జులాయి‌గా తిరుగుతుంటున్నాడు. ఈ జులాయి శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో స్థానికంగా ఉండే ఓ యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండాటాన్ని గమనించాడు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో చొరబడి ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
దీంతో ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు మహిళలు యువకుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments