Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూర్ఛ రోగంతో మహిళ మృతి... చనిపోయిందని తెలియక తల్లి శవంపై నిద్రపోయిన చిన్నారి!

హైదరాబాద్ నగరంలోని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో ఓ హృదయవిదారక దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. ఇది చూపరులను కంటతడిపెట్టించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... ఏ ప్రాంతానికి చెందినదో తెలియని ఒక మహిళ ఎక్కడికో వెళ్ల

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (13:45 IST)
హైదరాబాద్ నగరంలోని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో ఓ హృదయవిదారక దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. ఇది చూపరులను కంటతడిపెట్టించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... ఏ ప్రాంతానికి చెందినదో తెలియని ఒక మహిళ ఎక్కడికో వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చింది. స్టేషన్‌కు వచ్చాక ఆమెకు మూర్ఛ వచ్చింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళ స్టేషన్‌లోనే ప్రాణాలు కోల్పోయింది.
 
అయితే ఆమెతో ఉన్న చంటిబిడ్డకు ఈ విషయం తెలియక... తల్లిపాల కోసం మారాం చేశాడు. ఎంత పిలిచినా తల్లి లేవకపోవడంతో కాసేపు అలిగాడు. ఆ తర్వాత మళ్లీ తల్లి చెంతకు చేరి ఏడుపులంకించుకున్నాడు. తల్లిపాలు తాగే ప్రయత్నం చేసి, కన్నీళ్లింకిపోయి చివరకు తల్లి శవంపై ఆదమరచి నిద్రపోయాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో చూపరుల కంట నీరుతెప్పించింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చంటిబిడ్డను ఆస్పత్రికి తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments