Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు గుండెపోటు... ముందుగానే చనిపోవాలని భార్య సూసైడ్

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (10:37 IST)
వారిద్దరూ అన్యోన్య దంపతులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. కానీ, ఉన్నట్టుండి భర్తకు గుండెపోటు వచ్చింది. దీంతో భార్య తీవ్ర ఆందోళనకు గురైంది. భర్త కంటే ముందే చనిపోవాలని ఆ వివాహిత భావించింది. ఈ విషయాన్ని కన్నతల్లికి చెప్పింది. అలాంటి పిచ్చి పనులు చేయొద్దంటూ హితవు పలికింది. కానీ, ఆ భార్య మాత్రం తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతే.. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని నారాయణపేటకు చెందిన సింధూజ (25), రహమత్‌నగర్‌కు చెందిన శివకుమార్ భార్యాభర్తలు. వీరికి 13, 8 యేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న శివకుమార్‌కు ఈ నెల 12న గుండెపోటు వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సింధూజ తీవ్ర మనస్తాపం చెందింది.
 
తల్లి రత్నాదేవికి ఫోన్ చేసి భర్తకంటే ముందు తానే చనిపోతానని ఏడ్చింది. దీంతో ధైర్యం చెప్పిన తల్లి.. అలాంటి పిచ్చిపనులు చేయొద్దని, అంతా కుదుటపడుతుందని నచ్చజెప్పింది. అయినప్పటికీ ఆందోళన నుంచి బయటపడని సింధూజ ఈ నెల 14న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. 
 
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సింధూజ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments