ఏపీ మంత్రి పి. నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల ఆడియో టేప్ ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకున్న అంశాలు వివాదస్పదమయ్యాయి.
ఏపీ మంత్రి పి. నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల ఆడియో టేప్ ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకున్న అంశాలు వివాదస్పదమయ్యాయి. డీమానిటైజేషన్ తర్వాత నోట్ల మార్పిడి, ఉద్యోగుల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మహిళ ఉద్యోగులపై లైంగికవేధింపులపై మాట్లాడుకున్నారు. ఈ ఆడియో లీక్ కావడంతో విద్యార్థి సంఘలు మండిపడుతున్నాయి.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆడియో టేపు బయట పెట్టాడన్న అనుమానంతో వైస్ ప్రిన్సిపల్ నవీన్‌పై నారాయణ సిబ్బంది దాడి చేశారు. దీనిపై బాధితుడు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడియో టేపుతో తనకు సంబంధం లేదని చెప్పినా.. తనపై దాడి చేసినట్లు పేర్కొన్నాడు. పైగా, ఏపీ మంత్రి నారాయణ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా నారాయణగూడలోని నారాయణ కాలేజ్ దగ్గర ఆందోళన చేశారు ఏబీవీపీ కార్యకర్తలు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. నారాయణ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.