Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ఆధార్ కార్డును పరిశీలిస్తూ..?

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (11:32 IST)
11 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పరిధిలో ఉన్న కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌లో ఇంతిజార్‌ అలీ అనే ఓ స్కూల్ ప్రిన్సిపాల్ 11ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. 
 
బాధిత బాలిక స్థానిక ఉండే ఓ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. అయితే ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల స్కూల్ ఫీజు చెల్లించలేదు. దీంతో ప్రిన్సిపాల్ బాలికను పరీక్షలకు అనుమతించలేదు. కానీ ఆధార్ కార్డును తెస్తే పరీక్ష రాయిస్తానన్నాడు. 
 
సాయంత్రం సమయంలో ఆధార్ కార్డు పరిశీలించేందుకు బాలికను పిలిచాడు. కార్డును పరిశీలిస్తున్నట్టు నటించి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాధిత బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం