Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెర్నియా ఆపరేషన్‌ చేశాక కత్తెరను కడుపులో పెట్టి కుట్లు వేసిన వైద్యులు

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (11:37 IST)
ఓ మహిళకు హెర్నియా ఆపరేషన్‌ చేసిన వైద్యులు... కడుపులో కత్తెరను పెట్టి కుట్లు వేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికెళ్లి తనిఖీ చేయగా, కడుపులో కత్తెర ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, మంగళ్‌హాట్‌కు చెందిన మహేశ్వరి (33) అనే మహిళకు మూడునెలల క్రితం హెర్నియా ఆపరేషన్ జరిగింది. దవాఖానా నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన తర్వాత కడుపునొప్పి రావడంతో కంగారుపడి మరోసారి నిమ్స్ వైద్యులను సంప్రదించింది. 
 
వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు మహేశ్వరి పొట్టలో కత్తెర ఉన్నట్టు గుర్తించారు. మరోసారి ఆపరేషన్ చేసి కడుపులో నుంచి కత్తెరను వెలికితీశారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments