Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం కోసం కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టేసిన తల్లి.. హైటెక్ నగరంలో..?

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (09:39 IST)
పేగు బంధాన్నే అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. కన్నబిడ్డను మద్యం కోసం అమ్మకానికి పెట్టింది ఓ కనికరంలేని తల్లి. ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది. రెండు నెలల క్రితం జన్మనిచ్చిన బాబును రూ.45 వేలకు అమ్మకానికి పెట్టింది. దీంతో పోలీసులు పక్కా సమాచారంతో కేసును ఛేదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ఎంఎస్‌ మక్తాకు చెందిన అబ్దుల్‌ ముజాహిద్‌, షేక్‌ జోహాఖాన్‌ దంపతులు ఇటీవల హబీబ్‌నగర్‌ పరిధిలోని సుభాన్‌పురాకు మకాం మార్చారు. వీరికి రెండు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. మద్యం తాగే అలవాటున్న జోహాఖాన్ ఆమె భర్తతో తరుచు గొడవ జరిగేది. ఈనెల 3న ముజాహిద్‌ బంధువుల ఇంటికి వెళ్లాడు. 8వ తేదీన తిరిగి ఇంటికి రాగా కొడుకు కనిపించలేదు. భార్యను నిలదీయగా సుభాన్‌పురాకు చెందిన షేక్‌ మహమ్మద్‌(30), తబస్సుం (25)లకు రూ.45వేలకు అమ్మేసినట్లు భార్య ఒప్పుకుంది.
 
తన కొడుకును వెంటనే ఇవ్వాలని ముజాహిద్‌ కోరినా వారు అంగీకరించకపోవడంతో ముజాహిద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చంచల్‌గూడకు చెందిన ఆయేషా జబీన్‌(28)కి సంతానం లేకపోవడంతో.. అదే ప్రాంతానికి చెందిన షేక్‌ మహమ్మద్‌, తబస్సుంల ద్వారా బాబు(2 నెలలు) విషయం తెలుసుకుంది. 
 
డబ్బులు చెల్లించి ఆయేషా జబీన్ పిల్లాడిని తీసేసుకుంది. కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయేషా ఇంటిపై దాడి చేసి బాబును తీసుకుని తండ్రికి అప్పగించారు. ఆయేషా జబీన్‌, జోహాఖాన్‌, షేక్‌ మహమ్మద్‌, తబస్సుం, షమీమ్‌ బేగం, సిరాజ్‌ బేగంలను అరెస్టు చేశారు. కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments