Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని కడుపు చేశాడు.. ఇపుడు ముఖం చాటేస్తున్నాడు...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (09:32 IST)
ఓ కామాంధుడు చేతిలో మరో యువతి మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని ప్రేమించాడు. ఆ తర్వాత కాబోయే భార్యాభర్తలమంటూ సహజీవనం చేస్తూ కడుపు చేశాడు. తీరా... పెళ్లి చేసుకోమని నిలదీయడంతో ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి బంజారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్.ఎన్.నగర్‌లో 26 యేళ్ళ యువతి నివాసం ఉంటోంది. ఈమె స్థానికంగా ఉండే ఓ బీమా కంపెనీలో పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన షేక్ సమీర్ అనే వ్యక్తి పరిచయం పెంచుకుని ప్రేమించాడు.
 
ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ యువతిని నమ్మించాడు. దీంతో ఆ యువతి తొందరపడి అతనితో కలిసి సహజీవనం చేసింది. తీరా గర్భం రావడంతో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. కానీ ఆ యువకుడు పెళ్ళి చేసుకునేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. 
 
తనకు కడుపు చేసి ఇంకో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది. ఈ విషయమై నిలదీయడంతో ఆమె వ్యక్తత్వం మంచిది కాదంటూ నిందలు వేస్తున్నాడని ఆరోపించింది. దీనిపై పోలీసులు నిందితుడు సమీర్‌పై ఐపీసీ 493, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments