Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 కోట్ల విలువగల పార్కు స్థలం కబ్జా యత్నం-అడ్డుకున్న స్థానికులు

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (14:31 IST)
జిహెచ్ఎంసి పరిధిలోని పార్కులు ఖాళీ స్థలాలు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయి. అధికారులు స్థానిక ప్రజలు వీటిని అడ్డుకునేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కబ్జాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లేఅవుట్ ను 10 సంవత్సరాల క్రితం వేశారు. అయితే అక్కడ  ప్రజల అవసరాల కోసం ఖాళీ స్థలాలను పార్కు స్థలం కింద వదిలారు.
 
వీటికి రక్షణ లేకపోవడంతో కబ్జాదారుల కన్ను పడింది గోకుల్ ప్లాట్స్‌లో సుందర యాదయ్య పార్క్ పేరుతో రెండువేల ఎనిమిది వందల గజాల స్థలం ఉంది. దీని విలువ సుమారు 10 కోట్ల రూపాయలు ఉంటుంది. దీనిపై సుబ్బయ్య నాయుడు అనే వ్యక్తి కన్నేశాడు లే అవుట్ వేసిన సమయంలో చెట్లను సైతం నరికివేసి ఇ ఈ పార్కును కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. 
 
దీనిపై గతంలోనే స్థానిక అసోసియేషన్ ప్రజలు అడ్డుపడ్డారు జిహెచ్ఎంసి అధికారులు సైతం  ఈ స్థలాన్ని ఈ స్థలాన్ని పార్కు గా గుర్తించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి  సంబంధిత బిల్లులను జిహెచ్ఎంసి అనే చెల్లిస్తోంది. 
 
ఇలాంటి పార్క్ సైతం ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో స్థానికులు సదరు వ్యక్తిని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు కాపాడాలంటూ ఆదివారం అసోసియేషన్ ప్రజలు పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ స్థలంలో సమావేశం ఏర్పాటు చేసి పార్క్ ను కాపాడాలని కోరుతూ నినాదాలు చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments