Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్నేమో బిర్యానీలో గొంగలి పురుగు.. నిన్నేమో చాక్లెట్‌ కేక్‌లో బొద్దింక

హైదరాబాద్ నగరంలోని ఐకియా రెస్టారెంట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం ఐకియా రెస్టారెంట్ బిర్యానీలో గొంగలి పురుగు బయటపడింది. ఈ ఘటనపై అప్పట్లో కస్టమర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:12 IST)
హైదరాబాద్ నగరంలోని ఐకియా రెస్టారెంట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం ఐకియా రెస్టారెంట్ బిర్యానీలో గొంగలి పురుగు బయటపడింది. ఈ ఘటనపై అప్పట్లో కస్టమర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా ఇదే ఐకియా రెస్టారెంట్లో చాక్లెట్ కేక్ ఆర్డర్ చేస్తే బొద్దింక పాకుతూ కనిపించింది. ఓ కస్టమర్‌ ఐకియాలోని రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడ చాక్లెట్ కేస్ ఆర్డర్ చేశాడు. అందులో బొద్దింక కనిపించింది. వెంటనే దానిని ఫోటో తీసి ఆ కస్టమర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది ఐకియా స్టోర్‌కి చేరుకొని పరీక్షలు చేశారు. ఆ చాక్లెట్ కేకు సంబంధించిన కొన్ని శాంపిల్స్ సేకరించారు.
 
అంతేకాకుండా సంస్థకి రూ.5వేల జరిమానా కూడా విధించారు. శాంపిల్స్‌ని పరిశీలించి కంపెనీపై చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఐకియా స్టార్ ప్రారంభించిన రెండు నెలల్లోపే ఫుడ్ క్వాలిటీ లేదని వార్తల్లో నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments