Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడైన అరటిపండును డస్ట్‌బిన్‌లో వేయలేదనీ... టీసీఎస్ టెక్కీ ఏం చేశాడో తెలుసా?

ఇంట్లో పాడైన అరటిపండును చూసిన టెక్కీకి చిర్రెత్తుకొచ్చింది. అంతే ఒక్కసారి భార్యపై ఒంటికాలిపై లేచాడు. భోజనం చేస్తుందన్న విచక్షణ కూడా లేకుండా ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. భోజనం ప్లేట్‌ను తీసుని

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (15:05 IST)
ఇంట్లో పాడైన అరటిపండును చూసిన టెక్కీకి చిర్రెత్తుకొచ్చింది. అంతే ఒక్కసారి భార్యపై ఒంటికాలిపై లేచాడు. భోజనం చేస్తుందన్న విచక్షణ కూడా లేకుండా ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. భోజనం ప్లేట్‌ను తీసుని ముఖ్యంపై కొట్టాడు. అప్పటికీ కసితీరక పోవడంతో కిందపడేసి గొంతుపై కాలేసి తొక్కాడు. దీంతో మహిళ స్పృహ కోల్పోవడంతో ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్, మియాపూర్‌లో జరిగింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన పుష్పశ్రీకి, విజయవాడకు చెందిన బ్రహ్మేశ్వర రావుకు ఐదేళ్ల కిందట వివాహమైంది. బ్రహ్మేశ్వర రావు హైదరాబాద్‌లోని టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అయితే పెళ్లిన మరుసటి నెల నుంచే భార్యను వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన బ్రహ్మేశ్వర రావు పండ్ల ట్రేలో పాడైన ఒక అరటిపండును చూశాడు. చెడిపోయిన పండును పడేయకుండా ఇంకా ట్రేలో ఎందుకు ఉంచావంటూ భార్యను పట్టుకుని చితకబాదాడు. నానా యాగిరి చేశాడు. ఎదురింటివారు ఈ విషయంపై బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతోవారు అక్కడకు వచ్చిన పుష్పశ్రీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కిరాతక భర్త కోసం గాలిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments