Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో నమ్మించి.. సహజీవనం... కోర్కెతీరాక ఇంటి నుంచి గెంటేశాడు...

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (11:54 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ప్రొఫెసర్ ఓ విద్యార్థినిని మోసం చేశాడు. పెళ్లి పేరుతో ఆ విద్యార్థినిని హాస్టల్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సహజీవనం చేశాడు. తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావనరాగానే.. ఆమెపై చేయి చేసుకుని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్‌లో ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ఓ విద్యార్థిని ఎంఏ (ఆంగ్లం) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఇఫ్లూలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రంజిత్ తంగప్పన్ (40) పరిచయమయ్యాడు. ఈయన సీతాఫల్‌మండిలో నివశిస్తున్నాడు.
 
వివాహితుడైన తంగప్పన్‌... కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వనున్నట్టు ఆ విద్యార్థిని నమ్మించి చేరదీశాడు. పైగా, తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నానని, తనకుతోడు అవసరమని చెబుతూ బాధిత విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పైగా, హాస్టల్‌ నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. అలా కొంతకాలంపాటు వారిద్దరూ కలిసి జీవిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో అకస్మాత్తుగా ఈ నెల 12వ తేదీన బాధితురాలిపై చేయిచేసుకుని, పెళ్లి చేసుకోవడం కుదరదని, హాస్టల్‌కు వెళ్లిపోవాలని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఆమె నుంచి ఫోన్లు కూడా రాకుండా ఆమె నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాడు. ఈ నెల 19 నుంచి యూనివర్సిటీలో వారం పాటు సెలవు పెట్టి వెళ్లిపోయాడు. ఎంత ప్రయత్నించినా ఫోన్ కలవకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments