Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కుమార్తె రేప్ చేసిన వ్యక్తి హత్య కేసు... లొంగిపోయిన తండ్రి

తన కుమార్తె అనూషను అత్యాచారం చేసి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన గుంటి రాజేష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో మృతురాలి తండ్రి కోర్టులో లొంగిపోయాడు. ఆయన పేరు శ్యాంసుందర్ రెడ్డి. హైదరాబాద్ శివార్లల

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (10:57 IST)
తన కుమార్తె అనూషను అత్యాచారం చేసి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన గుంటి రాజేష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో మృతురాలి తండ్రి కోర్టులో లొంగిపోయాడు. ఆయన పేరు శ్యాంసుందర్ రెడ్డి. హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్‌లో గత నెల 27వ తేదీన ఈ దారుణం జరిగింది. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే, రాజేష్ హత్య అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన శ్యాంసుందర్ ఆపై ఆధిబట్ల పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. 
 
ఓ గుడికి చైర్మన్‌గా ఉన్న రాజేష్, భూదందాలు, రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు, అత్యాచారాలు, బెదిరింపులకు అలవాటు పడ్డాడని, అతనికి బతికే హక్కు లేదని చెప్పాడు. అతన్ని తాను చంపలేదని, తనపై అనుమానాలు ఉన్నాయి కాబట్టి లొంగిపోయేందుకు వచ్చానని తెలిపాడు. 
 
తన కుమార్తెకు మత్తుమందిచ్చి, ఆపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడని చెప్పాడు. దాన్ని యూట్యూబ్‌లో పెడతానని బెదిరిస్తూ, మానసిక హింసకు గురిచేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని వివరించాడు. రాజేష్ హత్యను ఎవరు చేశారన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుందని చెప్పాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments