Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారాంతాన్ని ఎంజాయ్ చేయొద్దంటే ఎలా? మందెక్కువై నడిరోడ్డుపై యువతుల హల్‌చల్

Hyderabad
Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (15:10 IST)
హైదరాబాద్ రోడ్లపై అమ్మాయిలు హల్ చల్ సృష్టించారు. పీకల వరకు మద్యం సేవించి యువతులు బాహాబాహీగా తలపడ్డారు. దీన్ని చూసిన పోలీసులు విస్తుపోయారు. దీనిపై పోలీసులు యువతులను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన యువతులు.. వారంతాన్ని కూడా ఎంజాయ్ చేయొద్దంటూ ఎలా? అంటూ నిలదీయడంతో పోలీసులు ఖంగుతిన్నారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన కొంతమంది అమ్మాయిలు జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్‌లో పూటుగా మందు కొట్టారు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో... రోడ్డుపై బాహాబాహీకి దిగారు. పొట్టిపొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు, రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుంటే, అక్కడ వందలాది మంది పోగయ్యారు. ఈ ఘటన నిన్న రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కేబీఆర్ పార్క్ వద్ద జరిగింది.
 
ఇప్పటికే హైదరాబాద్‌లోని పబ్‌ల వద్ద న్యూసెన్స్ పెరిగిపోయిందని, వారాంతం వస్తే గొడవలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న వేళ, వాటిని నిజం చేసిన ఘటన ఇది. ఓ అమ్మాయి తన చివరి పెగ్‌గా చెప్పుకున్న మద్యాన్ని మరో అమ్మాయి తాగడమే మొత్తం గొడవకు కారణమని సమాచారం. రోడ్డుపై అమ్మాయిలు గొడవ పడుతుంటే, తెలుసుకుని వచ్చిన ట్రాఫిక్ పోలీసులు, వారిని అదుపు చేసేందుకు మహిళా పోలీసులు లేక, తలపట్టుకోవాల్సి వచ్చింది. చివరకు లేడీ కానిస్టేబుళ్లను పిలిపించి, వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments