Webdunia - Bharat's app for daily news and videos

Install App

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

సెల్వి
శనివారం, 7 జూన్ 2025 (13:10 IST)
తన ఇంటి పక్కనే ఉంటున్న ఓ మహిళను తన భార్యగా భావించి, మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మైలార్‌దేవ్‌పల్లిలో ఆమెపై మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రగాయాలకు గురైంది. వివరాల్లోకి వెళితే.. రోజువారీ కూలీగా పనిచేస్తున్న సలీమ్ తన భార్య నూర్జహాన్‌తో కలిసి మైలార్‌దేవ్‌పల్లిలోని ఉద్డంగడ్డలో నివసించాడు. ఈ జంట మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందినవారు. 
 
సలీమ్ గది పక్కన, అబిదా అనే మహిళ కుటుంబంతో కలిసి ఉండేది. కొన్ని వారాలుగా సలీం, అతని భార్య మధ్య కొన్ని సమస్యలు నడుస్తున్నాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి కోపంతో రగిలిపోయాడు. శుక్రవారం రాత్రి, సలీం మద్యం సేవించి, మత్తులో ఇంటికి వచ్చాడు. 
 
తాగిన మైకంలో సలీం తన గదిలోకి వెళ్ళే బదులు, అబిద నిద్రిస్తున్న పొరుగువారి గదిలోకి వెళ్ళాడు. ఆ స్త్రీని తన భార్యగా భావించి పదునైన వస్తువుతో ఆమెపై దాడి చేశాడని మైయార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ పి. నరేందర్ అన్నారు.
 
దాడికి గురైన మహిళ సహాయం కోసం కేకలు వేసింది. పొరుగువారు సలీంను పట్టుకుని కొట్టారు. అబిదను ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మైయార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments