Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క భర్తతో అక్రమ సంబంధం.. తాగొచ్చి.. బజ్జీలు తెచ్చుకున్నాడని?

అక్క భర్తతో అక్రమ సంబంధం నెరపిన మరదలు చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. చదువుకుంటానంటూ హైదరాబాద్ వచ్చిన యువతి.. అక్క ఇంట్లో బసచేసింది. ఈ క్రమంలో బావతో ఆమెకు

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (10:50 IST)
అక్క భర్తతో అక్రమ సంబంధం నెరపిన మరదలు చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. చదువుకుంటానంటూ హైదరాబాద్ వచ్చిన యువతి.. అక్క ఇంట్లో బసచేసింది. ఈ క్రమంలో బావతో ఆమెకు సాన్నిత్యం ఏర్పడింది. అంతే అక్కను మోసం చేసి.. బావతోనే అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్లకు చెందిన నర్సింహులు ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీనగర్‌లో ఉంటున్నాడు. 16 ఏళ్ల క్రితం నర్సింహులు భార్య సోదరి సునీత (28) చదువుకోవడానికి అక్క వద్దకు వచ్చింది. ఇంటర్‌ పూర్తి చేసిన సునీతతో నరసింహులు కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె సోదరి కూడా అడ్డు చెప్పలేదు. దీంతో సునీత నర్సింహులు తమ సంబంధాన్ని కొనసాగించారు. 
 
కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. మేస్త్రీ పని చేసే నర్సింహులు మంగళవారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో బజ్జీలు తేవాలంటూ సూచించాడు. ఎవరూ వెళ్లకపోవడంతో అతనే వెళ్లి తెచ్చుకున్నాడు. ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేవు.. మద్యం తాగి బజ్జీలు తెచ్చుకుంటావా అని సునీత గొడవపడింది. 
 
ఈ సమయంలో నర్సింహులు భార్య, కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్లారు. గొడవతో మనస్తాపం చెందిన సునీత ఇంట్లోకి వెళ్లి కొక్కేనికి చీరతో ఉరేసుకుంది. దీన్ని గమనించిన నర్సింహులు స్థానికుల సహాయంతో సునీతను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సునీత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments