Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐమాక్స్ మిర్రర్ మేజ్‌లో బాలికల పట్ల ఉద్యోగి అసభ్య ప్రవర్తన... మూడేళ్ల జైలు

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:33 IST)
హైదరాబాద్‌ నగరంలో ఐమాక్స్‌లో థియేటర్‌లో మిర్రర్ మేజ్ హౌస్‌లో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో ఓ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు.. రూ.వెయ్యి అపరాధం విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన రెండు కుటుంబాల సభ్యులు రెండేళ్ళ క్రితం ఐమాక్స్ థియేటర్‌కు సినిమా చేసేందుకు వెళ్లారు. వీరిలో ఇద్దరు బాలికలూ  కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ మిర్రర్ మేజ్‌ హౌస్‌ను చూసేందుకు లోపలికి వెళ్లారు. 
 
ఈ హౌస్‌లో బయటి వెలుగుతో పోలిస్తే, చాలా తక్కువ కాంతి ఉంటుంది. చుట్టూ ఉండే అద్దాలు ఎంతో అయోమయానికి గురిచేస్తాయి. దీన్నుంచి బయటకు రావడం అంత సులువు కాదు. లోపలికి వెళ్లే వారికి సహాయం చేసేందుకు కొందరు ఉద్యోగులు కూడా ఉంటారు. వారి సూచనల మేరకు చేతులతో తడుముకుంటూ, అద్దాల మార్గంగుండా బయటకు రావాల్సి వుంటుంది.
 
ఈ క్రమంలో ఆ ఇద్దరు బాలికలపై అద్దాల హౌస్‌లో పని చేస్తున్న రతన్ ఆనంద్ (24) అనే యువకుడు వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆపై బయటకు వచ్చిన వారు, తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసును విచారించిన మొదటి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి‌కే సునీత, రతన్ ఆనంద్‌ను దోషిగా తేల్చి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం