కన్నబిడ్డను పక్కలో పడుకుని కామసుఖం ఇవ్వాలని వేధించిన కిరాతక తండ్రికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు తాజాగా వెల్లడైంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, మీర్‌పేట జిల్లెలగూడ ప్రాంతానికి చెందిన మహేందర్ అనే వ్యక్తిని భార్యతో పాటు 15 యేళ్ల కుమార్తె ఉంది. అయితే, కుమార్తెను కామవాంఛ తీర్చాలంటూ తరచూ వేధించసాగాడు. దీంతో అతడి భార్య భర్తతో పాటు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అప్పటినుంచి మద్యానికి బానిసైన మహేందర్ 2016 అక్టోబరు 20వ తేదీన మద్యం మత్తులో తన కుమార్తె(15)పై లైంగిత దాడికి యత్నించాడు.
కన్నతండ్రి వేధింపులు భరించలేక బాధితురాలు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో సాక్షాధారాలు పరిశీలించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.