Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు 48.. అతనికి 28... ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ కోసం వచ్చి చనిపోయిన టెక్కీ

Webdunia
బుధవారం, 8 మే 2019 (16:58 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితుడుని వెతుక్కుంటూ వచ్చిన ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక అభ్యుదయ నగర్‌లోని ఒయో లాడ్జిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు హోటల్‌కు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామాకు తరలించారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో మృతురాలి పేరు సంగీత అని, ఆమె వెస్ట్ బెంగాల్‌ వాసిగా గుర్తించారు. పైగా, ఈ మహిళ టెక్కీగా పని చేస్తున్నట్టు కనుగొన్నారు. 
 
అయితే, ఈమెకు మూడేళ్ళ క్రితం హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ క్రమంలో లోకేశ్ కోసం హైదరాబాద్‌కు ఆమె వచ్చినట్టు భావిస్తున్నారు. 
 
గత మూడు రోజులుగా వీళ్లిద్దరూ కలిసి ఒయో లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉన్నారనీ, మంగళవారం రాత్రి వారి మధ్య గొడవ జరిగినట్లు లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ ఆమెను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
 
దీంతో సీసీటీవీ ఫుటేజీలు, ఫేస్‌బుక్ చాటింగ్‌ల ద్వారా నిందితుడుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, సంగీత వయసు 48 సంవత్సరాల వరకు ఉండొచ్చని, లోకేశ్ వయసు 28 ఏళ్లని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments