Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ షీటర్ వేధింపులు .... బ్యూటీషియన్ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (17:38 IST)
హైదరాబాద్ నగరంలోని కేబీహెచ్‌పీలో ఓ బ్యూటీషియన్ ఆత్మహత్య చేసుకుంది. స్థానిక రౌడీ ఒకరు వేధింపులకు గురిచేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. మృతురాలి పేరు సత్యశిరీష్. తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుంది. 
 
తన భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని దొమ్మేరు ఆమె స్వగ్రామం. 
 
దీనిపై ఆమె భర్త గోపాలకృష్ణ స్పందించారు. తన భార్య మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. తన భార్య శిరీషను కొన్ని రోజులుగా స్థానిక రౌడీ షీటర్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో వాస్తవాలు బయటకు తీయాలని తన ఫిర్యాదులో కోరారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments