Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న మిర్యాలగూడలో.. నేడు ఎర్రగడ్డలో.. ప్రేమజంటపై వధువు తండ్రిదాడి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ ఎర్రగడ్డలో ఇదే తరహా ఘటన జరిగింది.

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (17:20 IST)
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ ఎర్రగడ్డలో ఇదే తరహా ఘటన జరిగింది. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద నడిరోడ్డుపై ఓ ప్రేమజంట(సందీప్-మాధవి)పై యువతి తండ్రి దాడిచేశాడు. ఎస్సార్ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం జరిగింది.
 
బైక్‌పై వచ్చిన యువతి తండ్రి వెనుక నుంచి వేట కొడవలితో దాడి చేసి అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. దాడిలో గాయపడిన వారిని స్థానికులు సనత్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన చికిత్స కోసం మాధవిని యశోదా ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా సందీప్‌, మాధవి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం ఇష్టంలేని మాధవి తండ్రి ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా కులాంతర వివాహం చేసుకున్న సందీప్ - మాధవి తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్సార్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఇరు కుటుంబాలను పెద్దలను పిలిపించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఎలాంటి హాని చేయవద్దని హెచ్చరించి పంపించారు కూడా. అయినప్పటికీ ఆ యువతి తండ్రి ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వధూవరులిద్దరూ గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments