Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (08:48 IST)
ఒక యుకుడుని కన్సెల్టెన్సీ పేరుతో మరో యువకుడు వినూత్న తరహాలో మోసం చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2.25 లక్షలు వసూలు చేసి ఆ తర్వాత నకిలీ కంపనీ ఆఫర్ లేఖ ఇచ్చాడు. తాను మోసపోయినట్టు తెలుసుకున్న ఆ యువకుడు చివరకు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లాకు చెందిన ఏ.సాయికుమార్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాద్ నగరంలోని వెంగళరావు నగర్‌‍ కాలనీలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, సాయికుమార్‌కు కన్సల్టెన్సీ ఉద్యోగం ఇప్పిస్తానని జానీ అనే యువకుడు నమ్మబలికాడు. అమర్నాథ్ అనే కన్సల్టెన్సీ‌కి డబ్బులు కట్టించాడు. డబ్బులు చెల్లించిన మూడు నెలల తర్వాత ఓ కంపెనీ పేరుతో జూమ్ కాల్ ఇంటర్వ్యూ నిర్వహించి, ఆ కంపెనీ పేరుతో ఆఫర్ లెటర్ సాయి కుమార్‌కు పంపించాడు. 
 
అయితే, ఆ కంపెనీ గురించి సాయి కుమార్ ఆన్‌లైన్‌లో శోధించగా ఎక్కడా వివరాలు తెలియరాలేదు. దీంతో అనుమానం వచ్చిన సాయికుమార్.. అమర్నాథ్‌ను నిలదీశాడు. ఆ మరుక్షణం నుంచి అమర్నాథ్ పరారీలో ఉంటున్నాడు. దీంతో సాయికుమార్ గుంటూరు మధురానగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments