ఐదేళ్ళ బాలికపై అత్యాచారం.. కామాంధుడుకి 20 యేళ్ల జైలు

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ కామాంధుడికి 20 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే, నాలుగు వేల రూపాయల అపరాధం కూడా విధించింది. 
 
తాజాగా వెల్లడైన ఈ వార్త వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని గోల్కొండ నయాఖిలాకు చెందిన అజ్మత్‌ఖాన్ (26) అనే వ్యక్తి వెల్డర్‌గా పని చేస్తున్నాడు. కామంతో కళ్లుమూసుకు పోయిన అజ్మత్ ఖాన్.. గత 2018 జూలై 29వ తేదీన ఐదేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పగా, వారంతా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
ఈ కేసును విచారించిన నాంపల్లి మెట్రోపాలిటిన్ కోర్టు నేరం రుజువు కావడంతో 26 యేళ్ళ అజ్మత్ ఖాన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఒకవేళ జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలలు అదనంగా శిక్ష విధించాలని నాంపల్లి మెట్రోపాలిటిన్ న్యాయమూర్తి కె.సునీత ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments