Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కిన కిక్కు దిగాల్సిందేనంటున్న పోలీసులు... మందుబాబులకు జైలుశిక్ష

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (09:03 IST)
ఎక్కిన కిక్కు దిగాల్సిందేనంటున్నారు హైదరాబాద్ నగర పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను సుమారుగా ఐదు వందల మందికి జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకున్నారు. 
 
ఇటీవలి కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ కారణంగా జరుగుతున్న ప్రమాందాల సంఖ్యా పెరిగిపోతోంది. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు యంత్రాంగం చేపడుతున్న పటిష్టమైన చర్యలు నిష్ప్రయోజనంగా మారుతున్నాయ. ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. 
 
ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గత నెలలో నిర్వహించిన స్పెషల్ డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో 2815 మంది పట్టుబడ్డారు. కోర్టులో రూ.61,35,400  మంది చెలానా చెల్లించారని హైదరాబాద్ నగర్ ట్రాఫిక్ చీఫ్ అనీల్ కుమార్ వెల్లడించారు. అలాగే, గత నెల్లో 480 మందికి శిక్ష పడిందని.. వీరిలో 223 మంది జైలుకు వెళ్లినట్లు.. 62 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడమో లేక సస్పెండ్ చేయడమో జరిగిందని వివరించారు. 
 
జైలుకు వెళ్లిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి 10 రోజులు.. ఏడుగురికి వారం, 12 మందికి 4 రోజులు, 19 మందికి 3 రోజులు, 142 మందికి 2 రోజులు, 42 మందికి ఒక రోజు జైలు శిక్ష పడింది. వీరితో పాటు మరో 257 మందిని కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులో నిల్చుని ఉండేలా శిక్ష వేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపారనే నేరంపై 10 మందికి రెండు రోజుల జైలు శిక్షలు విధించాయి. మరికొంతమందికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు అనిల్ కుమార్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments