Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత అన్నతో తన భార్యను చూసి షాకైన తమ్ముడు, ఆ తరువాత?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:17 IST)
తమ్ముడిని పెళ్ళి చేసుకుంది. అయితే అతని అన్నపై మోజు పెంచుకుంది. భార్య తన సొంత అన్నతో రాసలీలలు చేయడాన్ని కళ్ళారా చూసిన తమ్ముడు షాకయ్యాడు. ఈ విషయం తెలిసిన అతడు ఇక తమను వేగనివ్వడని నిర్ణయించుకుని పక్కా స్కెచ్ వేసి అతడిని అంతమొందించారు.
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గరలోని నవులూరు గ్రామమది. సీతారామాంజనేయులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి లక్ష్మితో వివాహమైంది. సీతారామాంజనేయుడు తాగుడు బానిస. అతని అన్న దుర్గాప్రసన్నకు ఏ అలవాటు లేదు. 
 
పెళ్ళి కూడా కాలేదు. దీంతో లక్ష్మి అతనిపై మోజు పడింది. తన పనేదో తాను చేసుకుని ఇంటికి వచ్చేసే దుర్గాప్రసన్నకు బాగా దగ్గరైంది. సరిగ్గా ఆగష్టు 20వ తేదీ విషయం కాస్త సీతారామాంజనేయులుకు తెలిసింది.
 
తన అన్నతో భార్య బెడ్ పైన ఉండడాన్ని చూసిన సీతారామాంజనేయుడు షాక్‌కు గురయ్యాడు. భార్యను హెచ్చరించాడు. అయితే లక్ష్మి తన భర్తను చంపేయాలని దుర్గాప్రసన్నను కోరింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఆటో తోలుతున్న సీతారామాంజనేయులుకు తన స్నేహితులు ఫోన్ చేశారు.
 
నేరుగా నవులూరు గ్రామం చివరికి రమ్మని పిలిచారు. వచ్చిన వెంటనే అతనికి పూటుగా మద్యం తాగించారు. సీతారామాంజనేయులు స్నేహితులకే కిరాయి వచ్చి దుర్గాప్రసన్న చంపిచేందుకు ప్లాన్ చేసారు. అతడిని దారుణంగా చంపేసి పక్కన కాలువలో పడేసి వెళ్ళిపోయారు.
 
సీతారామాంజనేయుడు కనిపించలేదని భార్య కాకుండా బంధువులు పోలీసులకు గత నెల 31వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసులు భార్యను గట్టిగా విచారిస్తే అసలు విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మీడియా ముందుంచారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments