Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరువు పోతుంది ఆ సంబంధం వద్దన్నందుకు భర్తను చంపి పూడ్చిపెట్టింది

Advertiesment
పరువు పోతుంది ఆ సంబంధం వద్దన్నందుకు భర్తను చంపి పూడ్చిపెట్టింది
, సోమవారం, 31 ఆగస్టు 2020 (17:36 IST)
బీహార్ లోని బేగూసరాయ్ ప్రాంతమది. రాంలాల్, శశికళలు ఇద్దరూ భార్యాభర్తలు. ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. 
 
అయితే రాంలాల్‌కు దగ్గరి బంధువు.. వరుసకు మరిది అయ్యే రమేష్ వ్యక్తితో ఐదు సంవత్సరాల నుంచి శశికళ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త మొదట్లో భర్తకు తెలియలేదు. కానీ రెండునెలల క్రితం శశికళ, రమేష్‌‌లు ఇద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని చూసేశాడు రాంలాల్. భార్యను మందలించాడు. పిల్లలు ఉన్న మన కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిపోతుందని... మారమని ప్రాధేయపడ్డాడు. అయినా భార్యలో మార్పు రాలేదు.
 
పదేపదే భర్త తనను సతాయిస్తున్నాడని, అతడిని చంపేసి ప్రియుడిని పెళ్ళి చేసుకోవాలనుకుంది శశికళ. రమేష్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. రమేష్ స్నేహితులు ఇద్దరు రాంలాల్‌కు కూడా స్నేహితులు. వారు రాంలాల్‌ను పార్టీకి పిలిచి ఫుల్లుగా మద్యం తాగించారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయేంతగా మద్యం తాగించి ఆ తరువాత రమేష్‌కు సమాచారమిచ్చారు.
 
శశికళ, రమేష్‌లు ఇద్దరూ అక్కడకు చేరుకుని బండరాయితో రాంలాల్ తలపై కొట్టి చంపేసి పక్కనే పూడ్చిపెట్టేశారు. ఆ తర్వాత భర్త కనిపించలేదని ఫిర్యాదు చేసింది భార్య. పోలీసులు విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరినీ, సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్‌కు పెద్దగా తెలుగు రాదు... అంత దారుణంగా అనడం సరికాదు... ఆర్ఆర్ఆర్