Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనితో భార్య ప్రేమాయణం.. నిలదీసిన భర్త.. అక్రమ కేసు పెట్టిన అత్తమామలు

కట్టుకున్న భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని నిలదీసినందుకు భర్తపై వివిధ రకాల ఆరోపణలు చేసింది. అంతటితో ఆగని ఆమె... చివరకు తల్లిదండ్రుల సహకారంతో తప్పుడు కేసుపెట్టించి పోలీసులతో చిత

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (15:52 IST)
కట్టుకున్న భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని నిలదీసినందుకు భర్తపై వివిధ రకాల ఆరోపణలు చేసింది. అంతటితో ఆగని ఆమె... చివరకు తల్లిదండ్రుల సహకారంతో తప్పుడు కేసుపెట్టించి పోలీసులతో చితక్కొట్టించింది. దీన్ని అవమానంగా భావించిన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడ సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విజయవాడకు చెందిన గురువా రెడ్డి అనే వ్యక్తి గాయత్రి అనే యువతితో వివాహమైంది. అయితే, గాయత్రికి కార్తీక్ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని కనిపెట్టిన భర్త.. భార్య గాయత్రిని నిలదీశాడు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది.
 
ఈ నేపథ్యంలో గాయత్రి ప్రేమాయణంపై ఆమె తల్లిదండ్రులతో గురువారెడ్డి పంచాయతీ నిర్వహించాడు. అయితే కూతురికి మంచి చెప్పాల్సిన తల్లిదండ్రులు ఆ పని చేయకుండా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అల్లుడిని బెదిరించారు. 
 
అత్తమామల ఆత్మహత్యాయత్నం కేసులో గురువారెడ్డిని పోలీసులు విచారించారు. అయితే చేయని నేరానికి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని... తనను అన్యాయంగా కొట్టారని పేర్కొంటూ గురువారెడ్డి మంగళవారం సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
 
ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చావుకు భార్య, అత్త, మామలే కారణమంటూ ఆ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. భార్య, అత్త, మామ అక్రమ కేసు బనాయించారని.. కృష్ణలంక పోలీసులు కొట్టడంతో మనస్తాపం చెందానని గురువారెడ్డి తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments