Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ భర్త చాలా సెక్సీ, ప్రియుడి భార్యకు ప్రియురాలు టార్చర్, చివరికి?

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (17:31 IST)
అతనో ఉపాధ్యాయుడు. చెప్పేది విద్యాబుద్ధులే అయినా కన్నుమిన్నూ కానరాకుండా కామాంధుడిలా మారిపోయాడు. తనతో సన్నిహితంగా ఉండే యువతులకు మాయమాటలు చెప్పి లోపబరుచుకోవడం అతనికి అలవాటు. ఇలా ఒక యువతిని దగ్గర చేర్చుకున్నాడు. మొదటి భార్యను మోసం చేసి చివరకు ప్రియురాలినే పెళ్ళి చేసుకున్నాడు.
 
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలం ముత్తలూరి గ్రామం పుల్లయ్య, కీర్తికి పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరు ఇక్కడే నివాసముంటున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. పుల్లయ్య, కీర్తి ఇద్దరూ విద్యావంతులే. పుల్లయ్య స్థానికంగా ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తుంటే కీర్తి ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. 
 
ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. సాఫీగా సాగిపోతున్న కుటుంబం. అయితే పుల్లయ్య మాత్రం విద్యాబుద్ధులు నేర్పించే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందరితో కాదు. తనకు బాగా సన్నిహితంగా మెలిగేవారితో మాత్రమే అలా చేస్తుంటాడు.
 
పుల్లయ్య బాగోతం బయటపడలేదు గానీ సుభాషిణి అనే విద్యార్థిని కారణంగా వారి కుటుంబం రోడ్డుపై పడింది. సుభాషిణి, పుల్లయ్యకు మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయం మెల్లగా భార్యకు తెలిసింది. భర్తను ప్రాధేయపడింది. 
 
కుటుంబాలు నాశనమవుతాయని భర్తకు చెప్పింది. అయినా వినిపించుకోలేదు. విషయాన్ని పుల్లయ్య సుభాషిణికి చెప్పాడు. దీంతో సుభాషిణి నేరుగా కీర్తికి ఫోన్లు చేయడం ప్రారంభించింది. పుల్లయ్యతో ఏకాంతంగా కలిసి ఉన్న ఫోటోలను వాట్సాప్‌కు షేర్ చేయడం ప్రారంభించింది.
 
ఇలా కీర్తిని మానసికంగా హింసించింది. దీంతో క్షోభను భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది కీర్తి. పోలీసులు కీర్తి ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే అందులో ఫోటోలను చూసి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం