Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగపూటే పరలోకానికి పంపిన కసాయి... భార్యను గొంతునులిమి హత్య చేసిన భర్త

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (08:46 IST)
ఓ కసాయి భర్త పండగ పూటే పరలోకానికి పంపించాడు. భార్యపై ఉన్న అనుమానంతో గొంతునులిమి హత్య చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని తలకొండపల్లికి చెందిన రాము (30) అనే వ్యక్తికి సరూర్ నగర్ డివిజన్‌లోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన శ్వేత (26) అనే మహిళతో ఎనిమిదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ బాబు ఉన్నాడు. 
 
మద్యానికి బానిసగా మారిన రాము.. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో భర్త వేధింపులు భరించలేని ఆమె రెండేళ్ల క్రితం సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. 
 
అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా ఇటీవల భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. సంక్రాంతి పండుగ రోజున రాత్రి ఫుల్లుగా తాగొచ్చిన రాము భార్య గొంతు నులిమి హత్య చేసి, ఇంట్లో ఉన్న రూ.15 వేలను పట్టుకుని పరారయ్యాడు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉన్నా అలికిడి లేకపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా శ్వేత మృతి చెంది కనిపించింది. ఆమె తండ్రి నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments