Publish Date: Sun, 13 Jan 2019 (16:45 IST)
Updated Date: Sun, 13 Jan 2019 (16:46 IST)
గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలని భార్యపై భర్త చేసిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని దిండి మండలంలోని ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగయ్యకు 8 నెలల క్రితం రాధ (22) అనే యువతితో వివాహం జరిగింది.
వివాహం సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, అత్తమామలు బైకును తీసివ్వాల్సివుంది. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ బైకును కొనివ్వలేక పోయారు. ఈ క్రమంలో ఎర్రగుంటపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీలకు కేటాయించారు. దీంతో తన భార్యను పోటీ చేయించాలని లింగయ్య భావించారు.
ఇందుకోసం రూ.5 లక్షల డబ్బును పుట్టింటికెళ్లి తీసుకుని రావాలంటూ భార్య రాధను వేధించాడు. భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లి తన తల్లిదండ్రులకు తన గోడును వెళ్లబోసుకుంది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రాధ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
webdunia
Publish Date: Sun, 13 Jan 2019 (16:45 IST)
Updated Date: Sun, 13 Jan 2019 (16:46 IST)