Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొకరితో భార్య నవ్వుతూ మాటలు... ముక్కలు ముక్కలుగా నరికిన భర్త...

అనుమానం పెనుభూతంగా మారింది. తన భార్య వేరొకరితో ఒకటిరెండు సార్లు నవ్వుతూ కనిపించింది. అంతే... తన భార్య అతడితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో భర్త అతి దారుణంగా భార్యను గొడ్డలితో నరికి చంపాడు. చంపడమే కాకుండా భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పరారయ

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:52 IST)
అనుమానం పెనుభూతంగా మారింది. తన భార్య వేరొకరితో ఒకటిరెండు సార్లు నవ్వుతూ కనిపించింది. అంతే... తన భార్య అతడితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో భర్త అతి దారుణంగా భార్యను గొడ్డలితో నరికి చంపాడు. చంపడమే కాకుండా భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పరారయ్యాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ఈ దారుణ సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
 
ఎమ్మిగనూరు మండలం కబేళా వీధిలో నివసిస్తున్న పర్వీన్‌ను, సున్నంబట్టీ కాలనీ వాసి బాషాకు ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం పెద్దలు వివాహం చేశారు. బాషా సెంట్రింగ్ పనిచేస్తూ జీవించేవాడు. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. ప్రస్తుతం పర్వీన్ మూడు నెలల గర్భిణి. ఈమధ్య ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడటం, ఆమె కూడా నవ్వుతూ అతడితో మాట్లాడటం గమనించాడు.
 
అంతే... భార్యపై అనుమానం పెంచుకున్నాడు బాషా. దీంతో పర్వీన్ నిద్రిస్తుండగా అర్థరాత్రి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments