Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురిని చంపి శివలింగానికి రక్తాభిషేకం... అనంతపురం జిల్లాలో దారుణం

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (10:45 IST)
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు అక్కలు, తమ్ముడిని చంపి శివలింగానికి రక్తాభిషేకం చేశారు. వీరంతా శివాలయంలో నిద్రిస్తుండగా పోలీసులు వీరిని గొంతుకోసి హత్య చేసి, రక్తాభిషేకం చేయడం జరిగింది. గుప్తనిధుల కోసం ఈ నరబలి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని కొర్తికోట గ్రామ సమీపంలోని శివాలయంలో ఈ కిరాతక చర్య జరిగింది. తమ్ముడు తంబళ్లపల్లెకు సుపరిచితుడు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
కొర్తికోటకు చెందిన కమలమ్మ(75) అనే వృద్ధురాలు గ్రామ సమీపంలోని పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అందుకు మదనపల్లెలో ఉంటున్న తమ్ముడు శివరామి రెడ్డి (65), బెంగళూరులో ఉంటున్న చెల్లెలు సత్యలక్ష్మి (70) సాయం కోరారు. అందరూ కలిసి ఆలయ బాగోగులు చూసుకుంటున్నారు. కమలమ్మ ఆలయం వద్దే ఉంటుండగా.. తమ్ముడు, చెల్లెలు వస్తూ పోతూ ఉండేవారు. 
 
సోమవారం పూజల నిమిత్తం ఆదివారం రాత్రి ముగ్గురూ ఆలయానికి చేరుకుని అక్కడే నిద్రించారు. తెల్లవారేసరికి ముగ్గురినీ దుండగులు కత్తితో గొంతు కోసి, చాతీపై గాట్లు పెట్టి హత్యచేశారు. తర్వాత వీరి రక్తంతో ఆలయంలోని శివలింగాన్ని, ఎదురుగా ఉన్న పుట్టకు అభిషేకం చేశారు. అనంతరం దుండగలు అక్కడే ఉన్న తొట్టెలో మునిగి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments